సరికొత్త బ్రేకింగ్ సిస్టమ్‌తో 2019 సుజుకి యాక్సెస్ 125
సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా తమ పాపులర్ యాక్సెస్ 125 స్కూటర్‌ను 2019 వెర్షన్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. 2019 సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో సరికొత్త కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ పరిచయం అయ్యింది. ఏప్రిల్ 2019 నుండి అందుబాటులోకి వచ్చే ప్రతి స్కూటర్లో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో సుజుకి ఇండియా తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లో సీబీఎస్ టెక్నాలజీని అందించింది.
సీబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ గల 2019 సుజుకి యాక్సెస్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 56,667 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేశారు. సీబీఎస్ లేనటువంటి మునుపటి యాక్సెస్ 125 స్కూటర్ ధరలో రూ. 690 పెరిగింది. సీబీఎస్ టెక్నాలజీ జోడింపు మినహాయిస్తే... ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.
2019 సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లో సాంకేతికంగా 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి గత ఏడాది విడుదల చేసిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ప్రీమియం స్కూటర్లో కూడా ఇదే ఇంజన్ అందించింది.