బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల: ధర ఎంతంటే?

Tuesday, August 6, 2019 08:12 PM Automobiles
బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:  ధర ఎంతంటే?

బెనెల్లీ ఇండియా విభాగం దేశీయ విపణిలోకి సరికొత్త బెనెల్లీ లియోన్సినో 500 (Benelli Leoncino 500) బైకును లాంచ్ చేసింది. "స్టాండర్డ్" అనే ఒక్క వేరియంట్లో మాత్రమే లభించే బెనెల్లీ లెయోన్సినో 500 బైక్ ధరను రూ. 4.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

10,000 రూపాయల బుకింగ్ అమౌంట్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని బెనెల్లీ విక్రయ కేంద్రాల్లో బెనెల్లీ లియోన్సినో 500 బైక్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు. సాంకేతికంగా బెనెల్లీ లియోన్సినో 500 బైకులో 499సీసీ కెపాసిటీ గల ట్విన్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47.6బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: