షాకింగ్ ప్రైజ్‌తో విడుదలైన కేటీఎమ్ 250 డ్యూక్ ఏబీఎస్ విడుదల
స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం కేటీఎమ్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కేటీఎమ్ 250 డ్యూక్ బైకును ఏబీఎస్ టెక్నాలజీ విడుదల చేసింది. సురక్షితమైన బ్రేకింగ్‌లో కీలక పాత్ర పోషించే ఏబీఎస్ టెక్నాలజీ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను భద్రత ప్రమాణాల రీత్యా బైకుల్లో కూడా తప్పనిసరి చేయడంతో కేటీఎమ్ తమ పాపులర్ 250 డ్యూక్ మోడల్‌ను ఏబీఎస్‌తో లాంచ్ చేసింది. సరికొత్త కేటీఎమ్ 250 డ్యూక్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.94 లక్షలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఏబీఎస్ లేనటువంటి రెగ్యులర్ మోడల్ ధర రూ. 1.80 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వబడ్డాయి.
కేటీఎమ్ ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ 125 డ్యూక్ మరియు 200 డ్యూక్ మోడళ్లలో సింగల్-ఛానల్ ఏబీఎస్ పరిచయం చేయగా... తాజాగా 250 డ్యూక్ మోడల్‌లో 390 డ్యూక్ తరహాలో ఉన్నటువంటి డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అందించింది. ప్రస్తుతానికి 250 డ్యూక్ బైకును ఏబీఎస్ మరియు నాన్-ఏబీఎస్ రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంచారు.
కేటీఎమ్ 250 డ్యూక్ బైకులో సాంకేతికంగా 249సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 30బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేటీఎమ్ 250 డ్యూక్ ప్రస్తుతం విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు అపాచే ఆర్‌టిఆర్200 మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.