మహీంద్రా XUV 300 మైలేజ్ వివరాలు లీక్

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV 300) ఎస్‌యూవీ వాహనాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ఏర్పాటు పూర్తి చేసుకుంది. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వాహనం మీద రూ. 20,000 లతో బుకింగ్స్ కూడా ప్రారంభించింది.
అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీకి సంబంధించిన మైలేజ్ వివరాలు రహస్యంగా బయటకొచ్చాయి. దేశీయంగా విడుదలయ్యే ప్రతి వాహనానికి అనుమతులు మంజూరు చేసే ఏఆర్ఏఐ విభాగానికి సమర్పించిన మైలేజ్ వివరాలు రహస్యంగా వెలువడ్డాయి. ఏఆర్ఐ సర్టిఫికేట్ మేరకు మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ వేరియంట్ లీటరు 17 కిలోమీటర్లు అదే విధంగా డీజల్ వేరియంట్ లీటరుకు 20 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నట్లు తెలిసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలోని డీజల్ వెర్షన్‌లో 121బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన మరాజొ ఎమ్‌పీవీలో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించింది. ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీలో టర్భో-పెట్రోల్ ఇంజన్ అందివ్వనున్నట్లు సమాచారం, అయితే సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ స్టోరీస్ కోసం మాతో కలిసి ఉండండి...