విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్: ధర ఎంతో తెలుసా?

Wednesday, July 3, 2019 04:00 PM Automobiles
విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్: ధర ఎంతో తెలుసా?

భారతదేశపు ప్రముఖ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొనసాగింపుగా ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకొచ్చారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 డీజల్ లభించే W8 మరియు W8(O) టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఈ ఏఎమ్‌టి వేరియంట్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ. 11.50 లక్షలు మరియు రూ. 12.70 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. బుక్ చేసుకునే కస్టమర్లకు వెంటనే డెలివరీ కూడా ఇవ్వనున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ సాంకేతికంగా 1.5-లీటర్ డీజల్ మరియు  1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. కానీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డీజల్ ఇంజన్‌లో మాత్రమే లభిస్తోంది. రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి ఎస్‌యూవీ ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి ఇతర కాంపాక్ట్  ఎస్‌యూవీలతో పోటీపడనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!