మారుతి నుండి మార్కెట్లోకి చిన్న కారు
మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్లోకి "ఎస్-ప్రెస్సో" అనే పేరుతో ఓ చిన్న కారును విడుదల చేయనున్నట్లు సమాచారం. మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న తరువాత ఉత్పత్తి మైక్రో ఎస్‌యూవీ అనే విషయం ఇప్పటికే ఖరారైంది. గత ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శనలో మారుతి సుజుకి తొలిసారిగా ఆవిష్కరించిన మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్-కాన్సెప్ట్ మోడల్‌ను ఎస్-ప్రెస్సో పేరుతో స్మాల్ ఎస్‌యూవీగా వచ్చే దీపావళి నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.
మారుతి ఎస్-ప్రెస్సో కారు ప్రస్తుతం ఉన్న ఆల్టో స్థానాన్ని భర్తీ చేయదు, కానీ బడ్జెట్ ధరలో ఖరీదైన మోడల్‌ను తలపించేలా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ మార్కెట్ మీద దృష్టిపెడుతున్నట్లు మారుతి సుజుకి ప్రతినిధులు పేర్కొన్నారు. అంటే ఇది విడదులైనా కూడా ఆల్టో మోడల్ యథావిధిగా అమ్మకాల్లో ఉంటుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ కారులో సాంకేతికంగా కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించే అవకాశం ఉంది. బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.