మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..?

Saturday, September 7, 2019 01:10 PM Automobiles
మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..?

మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన మోడల్ ఎక్స్ఎల్6 (XL6) ఎంపీవీ. మారుతి ప్రీమియం విక్రయ కేంద్రాలయిన మారుతి నెక్సా షోరూముల్లో ఎక్స్ఎల్6 మోడల్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 వెయిటింగ్ పీరియడ్‌కు సంభందించిన కీలకమైన సమాచారం బయటికొచ్చింది. మీరు మారుతి ఎక్స్ఎల్6 కొంటున్నారా..? అయితే ఈ స్టోరీ మీరు తప్పక చదవాల్సిందే..

హైదరాబాద్ నగరంలో మారుతి ఎక్స్ఎల్6 ఆటోమేటిక్ వేరియంట్లను రెండు వారాల వెయిటింగ్ పీరియడ్ అనంతరం డెలివరీ ఇస్తున్నారు. పూనే మరియు బెంగళూరులో ఉన్న కస్టమర్లకు సరిగ్గా నాలుగు వారాల వెయిటింగ్ పీరియడ్ అనంతరం డెలివరీ ఇస్తున్నారు. సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఎక్స్ఎల్6 ఎంపీవీ కారు మెటాలిక్ ప్రీమియం సిల్వర్, మెటాలిక్ మ్యాగ్నమ్ గ్రే, పర్ల్ బ్రేవ్ ఖాకీ, ప్రీమియం ఆబర్న్ రెడ్, పర్ల్ ఆర్కిటిక్ వైట్ మరియు నెక్సాన్ బ్లూ అనే ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మారుతి ఎక్స్ఎల్6 ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.46 లక్షలు ఎక్స్-షోరూమ్ ఇండియాగా ఉన్నాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: