రూ.1,410.29 కోట్ల లాభానికి పరిమితమైన ఎల్ అండ్ టీ
Saturday, November 28, 2020 02:00 PM Business
సెప్టెంబరు త్రైమాసికానికి ఎల్‌అండ్‌టీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,410.29 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,551.67 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం క్షీణించింది.
కరోనా దెబ్బకు ఆదాయం తగ్గడం, ఆర్థిక సేవల వ్యాపారంలో ఎన్‌పీఏల కోసం అధిక కేటాయింపులు జరపాల్సి రావడంతోపాటు మెట్రోరైల్ సేవల నిలిపివేత లాభాలకు గండి కొట్టిందని ఎల్ అండ్ టీ పేర్కొంది.
మూడు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.31,593.77 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి రాబడి రూ.35,924.89 కోట్లుగా ఉంది. సమీక్షా కాలానికి కంపెనీ వ్యయాలు రూ.29,455.57 కోట్ల స్థాయి నుంచి రూ.32,622.14 కోట్లకు పెరిగా యి. కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.18 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది.
For All Tech Queries Please Click Here..!