రుణాలను తిరిగి చెల్లిస్తా...
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల మేర రుణాలను ఎగ్గొట్టి, పరారైన విజయ్‌మాల్యా ...బ్యాంకులకు తిరిగి మొత్తం రుణాలను చెల్లిస్తానని బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమాన ఇంధన ధరలు పెరగడంతోనే ఎయిర్‌లైన్స్ పాక్షికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. ముడి చమురు ధర బ్యారెల్ 140 వద్ద ఉండగా కింగ్‌ఫిషర్ కూడా ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొందని, ఆ సయమంలో తాను రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించానని తెలిపారు. 100 శాతం రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లిస్తానని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
తన వ్యాపార సంస్థ మూడు దశాబ్దాల పాటు దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయలను అందించిందని, రాష్ట్రాలకు కూడా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దోహదపడిందని, ఇప్పుడా సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నా, తిరిగి రుణాలను చెల్లిస్తానని, వాటిని తీసుకోండి అని ట్వీట్ చేశారు. కింగ్ పిఫర్, ఇతర కంపెనీల తరుపున విజయ్‌మాల్యా వివిధ బ్యాంకుల నుండి రుణాలను పొందారు. 9వేల కోట్ల రూపాయల మేర తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని బ్యాంకులన్నీ చట్టపరమైన చర్యలకు చేపట్టేసరికి ఆయన 2016 మార్చిలో దేశాన్ని విడిచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు.