గుంటూరులో హైటెక్ వ్యభిచారం, కాలేజీ అమ్మాయిలు బీటెక్ స్టూడెంట్ల అరెస్ట్ ..!
గుంటూరులో మరో హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు చేదించారు. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ దందాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనికి ప్రధాన సూత్రధారి బీటెక్ విద్యార్థి కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. పాలిటెక్నిక్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వీరబ్రహ్మం గుంటూరులో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. వీరబ్రహ్మం ఓసారి ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి పరిచయమై అతడి నుంచి రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్ పంపాడు. అక్కడికి వెళ్లాక ఎవరూ లేకపోవడంతో అనుమానంతో రవికి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. అయితే వీరబ్రహ్మం ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను కూడా ఇలా మోసం చేయవచ్చని భావించాడు. దీంతో తన నెంబర్ కూడా ఆన్ లైన్‌లో పెట్టాడు. యువతుల్ని తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించడం ప్రరాంభించారు.
గత రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లితో వీరబ్రహ్మానికి పరిచయం అయింది. ఆమెతో ఉంటూ థామస్ కుమార్‌తో కలిసి పాత గుంటూరులో గది అద్దెకు తీసుకుని వ్యభిచారం దందాను మొదలుపెట్టారు. అయితే తరచూ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఇంటికి వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడి చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దందాను నిర్వహిస్తున్న నిడిగొండ వీరబ్రహ్మం, ఉప్పల థామస్‌కుమార్, భూపతి నాగేశ్వరరావు, నల్లపాటి అశోక్‌కుమార్‌లను మీడియా ఎదుట హాజరు పరిచారు. వేళ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అనేక కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలు నెంబర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.