మహిళను బంధించి వరుసగా గ్యాంగ్ రేప్ చేసిన 8 మంది

Sunday, August 25, 2019 11:46 AM Crime
మహిళను బంధించి వరుసగా గ్యాంగ్ రేప్ చేసిన 8 మంది

హర్యానా రాష్ట్రంలో ఓ మహిళపై ఎనిమిది అత్యంత పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసి సర్వత్రా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే యుపికి చెందిన బాధిత మహిళ కర్నాల్ రైల్వే స్టేషన్‌లో రైలుకోసం ఎదురుచూస్తుండగా ఓ వ్యక్తి ఆమెదగరకు వచ్చి తన దగ్గర ఆహారం ఉందని, తన వెంట వస్తే భోజనం చేయవచ్చని నమ్మించాడు. ఆ మహిళను అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్లగా అక్కడ ముందే ప్లాన్ ప్రకారం కాచుకొని ఉన్న ఏడుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అక్కడి నుంచి నిందితులు పారిపోయిన అనంతరం ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ మహిళ తీవ్రంగా గాయపడిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి సిసి కెమెరాల రికార్డు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: