బడాబాబుల కుమారులు, 182 మంది యువతులతో, ఫోన్ నిండా వీడియోలే.

ఇద్దరు వ్యాపార వేత్తల కొడుకులు 182 మంది యువతులతో ఆ పని చేసిన వీడియోలు బయటపడ్డాయి. కోల్‌కతాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన అనిష్ లోహారికా కుటుంబానికి పలు హోటళ్లు ఉన్నాయి. మరో యువకుడు ఆదిత్య అగర్వాల్ కుటుంబానికి బట్టల దుకాణాలు ఉన్నాయి. అయితే, వారిద్దరూ స్నేహితులు అయ్యారు. వారిద్దరూ కలసి యువతులతో స్నేహం చేయడం వారితో క్లోజ్ గా ఉన్న ఫొటోలు వీడియోలు తీసి వాటిని చూపించి బెదిరించేవారు. తమతో పడుకోవాలని కోరేవారు. అలా ఇద్దరూ కలసి 182 మంది యువతులతో ఆ పని చేసిన వీడియోలను భద్రంగా కెమెరాలో బంధించారు.
అయితే, సెక్స్ చేసిన తర్వాత వారిద్దరు యువకులు ఆ యువతులను వదిలేసేవారు. కానీ, అనిష్ లోహారికా హోటల్లో పనిచేసే ఓ కుక్ ఆ తర్వాత ప్లాన్ అమలు చేసేవాడు. ఆ యువతులు సెక్స్‌లో పాల్గొన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టేవాడు. యువతులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. అయితే, కొన్ని రోజుల క్రితం కుక్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని పట్టుకుని విచారిస్తే. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.