విద్యార్థినికి కడుపు చేసి, తల్లిని చేసిన కెమిస్ట్రీ టీచర్

Saturday, December 21, 2024 02:00 PM Crime
విద్యార్థినికి కడుపు చేసి, తల్లిని చేసిన కెమిస్ట్రీ టీచర్

విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు తన కూతురు వయసు ఉన్న ఓ విధ్యార్ధిని మార్కుల పేరుతో లొంగదీసుకుని కడుపు చేసి, తల్లిని చేశాడు.

వివరాల్లోకి వెళితో తమిళనాడులోని కడలూరు జిల్లా మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం, ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో ప్లస్-2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించి, ప్రాక్టికల్స్ లో మార్కులు తక్కువు వేస్తాని బెదిరించి లొంగదీసుకున్నాడు.

అయితే ఇదే విద్యార్థి ఇప్పుడు చెన్నైలోని ఓ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. కడుపు నొప్పి అధికం కావడంతో సదరు విద్యార్థిని కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడే ఆమె మగ పిల్లాడికి జన్మనిచ్చింది. దీంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది గమనించి ఆమె తల్లిదండ్రులతు సమారం అందించారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని తెలిపిన వివరాల మేరకు, తను ముందు చదివిన కాలేజీలోని కెమిస్ట్రీ టీచర్ మీద ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువాలం అరెస్ట్ చేశారు. మార్కులు తగ్గిస్తానని చెప్పి బెందిరించి గతేడాది ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. అయితే, సదరు కీచక ఉపాధ్యాయుడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: