ఇకపై ఎప్పటికీ ఆ తప్పు చేయను: అను ఇమ్మాన్యుయేల్.
స్టార్ హీరోల సరసన నటించింది కానీ అంత స్టార్ కాలేకపోయింది. అందం ఉంది కానీ అదృష్టం లేకుండా పోయింది. ఈ హీరోయిన్ ఎవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. ఇంకెవరు అనూ ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా హిట్ కావటం వలన ఆ హిట్ స్టార్ హీరోల పక్కన అవకాశాలను తెచ్చిపెట్టింది కానీ, సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేకపోయింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినప్పటికీ ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉంది. మళ్లీ టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఆమెను అవకాశాలు వరిస్తున్నాయి. అయితే స్టార్ హీరోల సరసన నటించినా కూడా మీకు ఈ గ్యాప్ రావడానికి కారణం ఏమిటని అనూని అడిగితే ఆసక్తికరంగా సమాధానమిచ్చింది.
సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో నాకు తెలిసేది కాదు. దాంతో కొద్దిగా తడబడిన మాట వాస్తవమే. దానికితోడు నాకు కథ చెప్పడానికి వచ్చినవారు నా పాత్ర మాత్రమే చెప్పేవారు. సినిమా కథేమిటో నాకు తెలిసేది కాదు. ఏమీ తెలియకుండానే సినిమా చేసేదాన్ని. దాంతో ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక నుంచి అలాంటి తప్పులు చేయదలుచుకోలేదు. పూర్తి స్ర్కిప్టుతో వస్తేనే సినిమా చేయాలని అనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చేవారికి అదే చెబుతున్నాను. అలా వచ్చినవారి కథలే వింటున్నాను. మిగతా వారిని మర్యాదగానే తిప్పి పంపిస్తున్నాను. అని అను తెలిపింది.