BREAKING: నేలరాలిన మరో బాలీవుడ్ దిగ్గజం

Thursday, April 30, 2020 10:57 AM Entertainment
BREAKING: నేలరాలిన మరో బాలీవుడ్ దిగ్గజం

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ అరుదైన క్యాన్సర్ (పేగు ఇన్‌ఫెక్షన్‌)తో ఈ 53 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇర్ఫాన్ ఖాన్ మరణం కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ మరియు రాజకీయ నేతలను శోక సంద్రంలో ముంచింది. తల్లి సయీదా బేగం (95) చనిపోయిన ఐదు రోజులకు ఇర్ఫాన్‌ ఖాన్ కూడా కన్ను మూశారు. ఇర్ఫాన్ తల్లి శనివారం జైపూర్‌లో తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్‌ వల్ల ఇర్ఫాన్‌ తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. బుధవారం నాడు చనిపోవడానికి ముందు ఇర్ఫాన్‌ చివరి క్షణాల్లో అన్న మాటలు అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. "నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది" అని తుదిశ్వాస విడిచే ముందు అన్నారట. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియల్ని ఎలాంటి ఆర్బాటాలు లేకుండా, అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు.

అనుకోని మరణాలు బాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం మరువక ముందే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సరిగ్గా ఐదు రోజుల క్రితం ఇర్ఫాన్ ఖాన్ తల్లి.. నిన్న ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృది చెందిన ఘటనలు మరువకనే బాలీవుడ్‌ను మరో బ్యాడ్ న్యూస్ పలుకరించింది.

అలనాటి దిగ్గజ నటుడు రిషి కపూర్ కాసేపటి క్రితమే మృతి చెందాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రిషికపూర్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో కొద్దిసేపటి క్రితం మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. రిషి కపూర్ మృతి పట్ల అమితాబచ్చన్ మరియు పలువురు సినీ తారాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: