అతనితో పడుకోమని పనిచేసేవాడు... ఆ దర్శకుడు 25 రోజులు నరకాన్ని చూపించాడు..!

Monday, July 29, 2019 10:44 AM Entertainment
అతనితో పడుకోమని పనిచేసేవాడు... ఆ దర్శకుడు 25 రోజులు నరకాన్ని చూపించాడు..!

జీవిత రాజశేఖర్ చిన్న కూతురు హీరోయిన్ గా,విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తొలి సినిమా దొరసాని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరికి ఇది తొలి సినిమా కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేకపోయినా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరో,హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ దొరసానిగా మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దొరసాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తొలి సినిమాలోనే శివాత్మిక నటనపై సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు.

శివాత్మిక మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగు కోసం తెలంగాణ పరిసర ప్రాంతమైన కోదాడకు వెళ్ళాం. అక్కడే 25 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో 'కల్కి' సినిమా షూటింగ్ జరుగుతుండటంతో అమ్మానాన్నలు, అక్కయ్య హైదరాబాదులో ఉండిపోయారు. అయితే ఒకరోజు నన్ను వదిలేయండి, అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి వస్తాను అంటే దర్శకుడు మహేంద్ర అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత ఆ మరుసటి రోజు ఒకే ఒక్క సీన్ షూట్ ఉంది అది పూర్తికాగానే హైదరాబాద్ వెళ్లిపోదామని అనుకున్నా. కానీ ఆ సీన్ పూర్తయ్యేసరికి సాయంత్రం 4 అయింది. ఆ సందర్భంలో నాకు దర్శకుడుపై వచ్చిన కోపాన్ని ఆపుకోలేకపోయా అని చెప్పుకొచ్చింది శివాత్మిక. సినిమా షూటింగ్ లో వున్న ఒక వ్యక్తి నాతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో నేను అతనిపై కంప్లైంట్ చేశాను అసలే అప్పుడు చాలా ఫ్రెస్ట్రేషన్ లో వున్నాను వాడు నాతో అలా ప్రవర్తించే సరికి చాలా చిరాకు,కోపం వచ్చాయి అని చెప్పారు శివాత్మిక . ఏకంగా 25 రోజుల పాటు నన్ను అక్కడే ఉంచారు కనీసం అమ్మ వాళ్ళదగ్గరికి వెళ్ళొస్తానని చెప్పినా కానీ ఆ డైరెక్టర్ అస్సలు పట్టించుకోకుండా తమ పనేదో తాను చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత షూటింగ్ దగ్గరకు మా అక్క రావడంతో చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాయని చెప్పుకొచ్చారు.

For All Tech Queries Please Click Here..!
Topics: