సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం, రూమర్లను ఖండించిన కుటుంబం

Tuesday, March 31, 2020 09:54 AM Entertainment
సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం, రూమర్లను ఖండించిన కుటుంబం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకోన్నది. సల్మాన్‌ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ ఆకస్మిక మృతి చెందండంతో కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నది అతని వయసు సంవత్సరాలు మాత్రమే. తన మేనల్లుడి మృతిని సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులకి తెలియచేసారు. అలాగే అబ్దుల్లా ఖాన్ మృతిపై వస్తున్న రూమర్లను కూడా కుటుంబ సబ్యులు ఖండించారు.

వివరాల్లోకి వెళితే, డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న అతను రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని ధిరూభాయ్ కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో మేనల్లుడిని మెరుగైన చికిత్స కోసం ముంబై బాంద్రాలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అనారోగ్యం కారణంగా అబ్దులా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మేనల్లుడి మరణంపై మీడియాలో అనేక రూమర్లు వచ్చాయి. కరోనావైరస్ కారణంగా మరణించారనే వార్తను సల్మాన్ ఖాన్ కుటుంబం ఖండించింది. హృదయ సంబంధిత వ్యాధితోనే ఆయన మరణించారు. గత కొద్దికాలంగా అబ్దుల్లా మధుమేహం వ్యాధి కూడా బాధపడుతున్నారు అని సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: