క్యాస్టింగ్ కౌచ్ అసలు రంగు, కమిట్మెంట్ అడగడానికి కోడ్ సిగ్నల్ తెలుసా..

Sunday, May 10, 2020 09:36 AM Entertainment
క్యాస్టింగ్ కౌచ్ అసలు రంగు, కమిట్మెంట్ అడగడానికి కోడ్ సిగ్నల్ తెలుసా..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై వార్తలు వస్తూనేవున్నాయి చాలామంది హీరోయిన్లు బహిరంగంగానే వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా భయటపెడుతున్నారు. సీనియర్ నటీమణులు కూడా ఇటీవల బడా నిర్మాతలకు సంబంధించిన ప్రవర్తన గురించి చెప్పడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మీటూ కామెంట్స్ తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో షెర్లిన్ చోప్రా మరోసారి మీటూ వివాదంపై కొత్త తరహా కామెంట్స్ చేసింది. షెర్లిన్ చోప్రా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. నెటీజన్స్ కి ఈ బ్యూటీ చేసే కాంట్రవర్సీల గురించి బాగా తెలుసు. సొంతంగా ఒక యాప్ ద్వారా తన అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును తన వైపుకు తిప్పుకుంటోంది.

ఎవరైనా కమిట్మెంట్ కోసం మనల్ని అడగాలని అనుకుంటే ఒక కోడ్ వాడతారని షెర్లిన్ ఈ విధంగా వివరణ ఇచ్చింది. కెరీర్ మొదట్లో నేను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా నన్ను చాలా మంది కమిట్మెంట్ అడుగుతూ ఇబ్బంది పెట్టారు. అందులో చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు. అయితే ఎక్కువగా అందరు వాడే ఒకే ఒక్క కోడ్.. డిన్నర్ కి రమ్మనడం అలా పిలిచారు అంటే కమిట్మెంట్ కోసమే అని షెర్లిన్ తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: