నగ్నంగా కనిపించా. ఆ ఒక్కటి ఉంటేనా, వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని

Monday, March 2, 2020 07:25 AM Entertainment
నగ్నంగా కనిపించా. ఆ ఒక్కటి ఉంటేనా, వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉపాసన, రామ్ చరణ్, బాలకృష్ణ, కల్కి కొచ్లిన్ లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మపైనే ఓ బాంబ్ పేల్చింది. ఆర్జీవీపై చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఐస్ క్రీమ్2 సినిమాతో వర్మతో కలిసి పని చేసింది గాయత్రీ గుప్తా. ఆపై అడపాదడపా చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతోంది.

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రీ మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేసిన రచ్చేంటో తనకు తెలుసని.. ఆమె చెప్పనవన్నీ నిజమేనని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ శ్రీరెడ్డి అంత హంగామా చేసినప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని తెలిపింది. ఆమె ఇచ్చిన సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు, ఎంతో కాలం నిలవదని అనిపించినట్టు పేర్కొంది. అందరూ అందర్నీ వాడుకుంటారని.. తన పీఆర్ కోసం ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాననీ, మీ టీఆర్పీ కోసం నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని ఇలా అందరూ అందర్నీ వాడుకుంటారని చెప్పుకొచ్చింది. ఎప్పుడైన వేధింపులు ఎదురయ్యాయా? మోసపోయారా అని యాంకర్ అడిగితే.. మోస పోవడం అనేది కామన్ ఎక్కడైనా జరుగుతుంది కదా అని బదులిచ్చింది.

తాను వర్మను ఐస్‌క్రీమ్2 చిత్రం సమయంలో కలిశానని తెలిపింది. అంతకు ముందు ఆర్జీవీ గురించి విన్నానని కానీ అంతగా తెలీదని చెప్పుకొచ్చింది. తాను వ్యక్తిగతంగా తెలిస్తేనే ఎవరి గురించైనా ఓ అభిప్రాయానికి వస్తానని అంది. మూవీ షూటింగ్ సమయంలో షాట్ అయిపోయాక క్షణం కూడా ఉండేవాడు కాదని తెలిపింది. ఆయనతో సినిమా చేయడం అంటే మ్యారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటుందని చెప్పుకుంటూ.. ఆయన యువకుడై ఉంటే బాగుండేదని తెలిపింది. తన కంటే ఓ ఐదేళ్లు పెద్దై ఉంటే బాగుండేదని గాయత్రీ అంటూ ఉంటే.. ఏం చేసేవారని సదరు యాంకర్ ప్రశ్నించాడు. ప్రపోజ్ చేసేదాన్ని, వెంటపడేదాన్ని ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేదాన్నంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: