సమ్మర్‌లో సపోటా తింటే కలిగే ప్రయోజనాలు
వేసవి కాలంలో సపోటా పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ కాలంలో వచ్చే సపోటా పండ్లు ఎంతో తీయగా ఉంటాయి. వీటిలో ప్రక్టోజ్, సుక్రోజ్ మరియు చక్కెర సమృద్దిగా ఉండటమే ఇందుకు కారణం. వీటిలో ఎన్నో విటమిన్లు మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరం బాగా నీరసించినపు మరియు బాగా అలసిపోయినపుడు ఓ రెండు మూడు సపోటా పండ్లను తిన్నా... లేదంటే జ్యూస్ చేసుకుని తీసుకున్నా... తక్షణే ఎనర్జీ అందుతుంది. అంతే కాకుండా ఇందులో ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. రక్తహీనతతో భాదపడే వరకు సపోటా పండ్లు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే వేసవిలో సపోటా పండ్లను తప్పనిసరిగా తీసుకుంటే కలిగే ఐదు ప్రయోజనాలేంటో చూద్దాం రండి..
1. సపోటా పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
2. సపోటాలో రక్తవృద్ధి, దాతుపుష్ఠిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.
3. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల
శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి.
4. ఇవి మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాదిగ్రస్తం కాకుండా కాపాడతాయి.
5. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.