ఆ పనిపైన ఆసక్తి తగ్గిందా? అయితే భార్యాభర్తలూ ఇలా ట్రై చేయండి..

Tuesday, July 30, 2019 10:02 PM Lifestyle
ఆ పనిపైన ఆసక్తి తగ్గిందా? అయితే భార్యాభర్తలూ  ఇలా ట్రై చేయండి..

చాలామంది భార్యాభర్తలు పెళ్లయిన కొత్తలో లైంగిక జీవితాన్ని సంతృప్తిగా అనుభవిస్తారు, కానీ కొంత కాలం తర్వాత దానిపై ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. ఆ కోరికలు కలగడం లేదని భాగస్వామిని దూరం పెడుతుంటారు. కొంతమంది తనకు కోరికలు ఉన్నా భాగస్వామికి లేదని, ఎంతగా ప్రేరేపించాని కోరిక రావటం లేదని బాధపడుతుంటారు. ఇది స్త్రీ, పురుషులిద్దరూ ఎదుర్కొనే సమస్యే. చాలామంది దీన్ని లైంగిక పరమైన సమస్య అనుకుంటారు. అయితే ఇది కేవలం లైంగిక సమస్య మాత్రమే కాదని మానసిక, శారీరక సమస్యలే దీనికి ప్రధాన కారణమవుతామని నిపుణులు చెబుతున్నారు. 

భాగస్వాముల్లో ఒకరు సెక్స్‌కు సిద్ధపడినప్పుడు మరొకరు వద్దు అంటున్నారంటే మరేదో సమస్య ఉందని గ్రహించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యను అధిగమించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. భార్యభర్తలు బెడ్‌రూమ్‌ లోకి వస్తే సెక్స్ కోరికలకు తప్ప మరే ఆలోచనలు రానివ్వకూడదు. మనసు నిండా అవే కోరికలు ఉండాలి. కుటుంబ, ఆర్థిక సమస్యలను పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించకూడదు. ఆ సమయాన్ని ఇతర సమస్యలపై చర్చించడానికి కేటాయించకూడదు. ఎన్ని పనులు, ఒత్తిడి ఉన్నా రోజూ సెక్స్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. అనేక మానసిక, శారీరక సమస్యలకు శృంగారమే ఔషధంగా పనిచేస్తుంది. భాగస్వామిలో ఏ ప్రదేశాలను టచ్ చేస్తే మూడ్ వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. సెక్స్‌కు సిద్ధపడుతున్నప్పుడు ముందుగా ఆయా భాగాలను స్పర్శించాలి. అలా చేయడం వల్ల భాగస్వామిలో క్రమంలో సెక్స్ పరమైన ఆలోచనలు కలుగుతాయి. అలా ఫోర్‌ప్లే చేస్తూ క్రమంగా సెక్స్‌కు సిద్ధం చేయాలి. పడక గదిలోకి వెళ్లగానే వెంటనే సెక్స్‌కు రెడీ అయిపోకుండా ముందుగా భాగస్వామితో సెక్స్ సంభాషణ మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా సెక్స్ చేసుకునే జంటల్లో మానసిక ఆందోళనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలాయి.. 

For All Tech Queries Please Click Here..!
Topics: