ఈ స్వామి 4 దశాబ్దాలు నీటిలో ఎందుకు ఉన్నాడు ? నివురు గప్పిన చరిత్ర రహస్యాలు మీకోసం

Tuesday, August 20, 2019 07:36 PM Lifestyle
ఈ స్వామి 4 దశాబ్దాలు నీటిలో ఎందుకు ఉన్నాడు ? నివురు గప్పిన చరిత్ర రహస్యాలు మీకోసం

హిందూ పురాణాలు ఆలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హిందూ విశ్వాసం అంత బలీయమైనది కాబట్టే వివాదాలను, విమర్శలను, నాస్తికతను కూడా తట్టుకుని అంతే బలంగా నిలబడుతోంది. అదే మన హైందవ సంస్కృతిలో ఉన్న బలం. మనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని,అలౌకిక అనుభూతిని కలిగించే అంశాల గురించి ఎంత తెలుసుకున్నా అది మనసుకు హాయినిస్తుంది. మన దేవాలయాల్లో భాగంగా ఈ రోజు కాంచీపురం నగరంలో ఉన్న వరదరాజ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణాదిన  కాంచీపురం ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అడుగడుగునా ఆలయాలే దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలో ఏ నగరం చూసినా ఆలయాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కిన కాంచీపురంలో సుమారు 1000కి పైగా ఆలయాలు హిందూ మత వైభవాన్ని చాటిచెబుతున్నాయి. ఈ దేవాలయాల్లో శ్రీ వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా ఈ దేవాలయం విరాజిల్లుతుంది. పూర్తి స్టోరీని వీడియోలో చూడవచ్చు.

For All Tech Queries Please Click Here..!
Topics: