అజినోమోటో ఒక సైలెంట్ కిల్లర్
మనం ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడతాం, కాని ప్రస్తుతం కాలం మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా రెడీ టు ఈట్ ఫుడ్స్ దర్శనమిస్తున్నాయి. అయితే రెడీ టు ఈట్ ఫుడ్స్ మీద ప్రజల్లో కొంత చైతన్యం కూడా పెరిగింది. గుడ్డిగా ఏదిపడితే అది కొనుక్కుని తినే పరిస్థితిలో ప్రజలు లేరు. తాము తీసుకుంటున్న ఆహార పదార్థాలలో ఏఏ దినుసులు ఉపయోగించి తయారు చేశారనే విషయాన్ని ఆయా ప్యాకెట్ల లేబుల్స్‌పై చూస్తున్నారు. ఈ రకమైన చైతన్యం ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు అందులో కలిపే అజినామోటోపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.
అజినామోటో శాస్త్రీయ నామం మోనోసోడియం గ్లూటమేట్. ప్యాకెట్లలో లభ్యమయ్యే దీనిని అనేక రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాలను(నూడుల్స్) తయారు చేయడంలో మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం అన్ని రకాల ఆహారాల్లోనూ దీనిని విరివిగా వాడుతున్నారు. రెడీ టు ఈట్ పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ను పరిశీలిస్తే అందులో వాడిన ఇంగ్రిడిఎంట్స్ జాబితాలో ఖచ్చితంగా అజినామోటో పేరు కూడా కనిపిస్తుంది. నూడుల్స్ వంటి పదార్థాల్లోనే కాకుండా చివరకు ఆలు చిప్స్ వంటి పదార్థాల్లో కూడా దీని వాడకం కనిపిస్తుంది.
జపాన్‌కు చెందిన అజినామోటో కార్ప్ దీనిని తొలిసారిగా కనుగొన్నది. ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా మరియు రుచిగా ఉండేట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనికి అలవాటుపడేలా చేస్తుంది. అజినామోటో అతి తక్కువ ధరకే లభ్యం కావడమనేది ఆహర పదార్థాలు తయారు చేసే కంపెనీలకు ఒక వరంగా మారింది.
అజినామోటో వల్ల కలిగే అనర్థాలేంటో పరిశీలిద్దాం.
- ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా , నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలను కొంతమంది ఎదుర్కొంటున్నారు.
- గుండె వైఫల్యం(హార్ట్ అట్టాక్).
- గర్భిణీ స్త్రీలు అజినామోటో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.
- బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది
- బరువు పెరుగుతారు
- అజినామోటో వల్ల నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది.
- థైరాయిడ్ ప్రాబ్లెమ్