తెలంగాణలో కరోనా మరణ మృదంగం ..
తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురిని బలితీసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు 76 కు చేరాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది.
వివరాలలోకి వెళితే ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, అపోలో, గ్లోబల్ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది కాబట్టి, ఆ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది అని తెలిపారు.