మళ్ళీ పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్: నోటీసులిచ్చిన పోలీసులు

Monday, December 23, 2024 11:07 PM News
మళ్ళీ పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్: నోటీసులిచ్చిన పోలీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో పోలీసులు తెలిపారు.

సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కి సలాటలో ఒకరి మృతిచెందగా మరొక పరిస్థితి విషమంగా ఉంది . ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను అల్లు అర్జున్ పొందారు.

For All Tech Queries Please Click Here..!
Topics: