410 మంది ఉద్యోగుల తొలగింపు.. ఏపీ ప్రభుత్వం

Tuesday, December 24, 2024 06:46 PM News
410 మంది ఉద్యోగుల తొలగింపు.. ఏపీ ప్రభుత్వం

ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్‌ జీవీ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 

''గత ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్‌నెట్‌లో నియమించింది. గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తాం. ఫైబర్‌ నెట్‌ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.

వైకాపా నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని ఉద్యోగాల్లో నియమించారు. కొందరు ఫైబర్ నెట్ ఉద్యోగులు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారు. జీతాల పేరుతో ఫైబర్‌నెట్‌ నుంచి కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. వైకాపా ప్రభుత్వం వైఖరితో ఫైబర్‌నెట్‌ దివాలా అంచుకు చేరింది. మేము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదు. ఉద్యోగులకు లీగల్‌ నోటీసులు ఇచ్చి వివరణ కోరతాం. ఫైబర్‌ నెట్‌లో అవసరాల మేరకు ఉద్యోగులను తీసుకుంటాం'' అని జీవీ రెడ్డి తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: