భారీ శబ్దాలు చేసుకుంటూ తిరిగే యువతపై జిల్లా ఎస్పీ కొరడా

టూవీలర్లకు సైలెన్సర్లు బిగించుకుని భారీ శబ్దాలు చేసుకుంటూ తిరుగుతున్న వారిపై జిల్లా ఎస్పీ కొరడా. నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న 110 టూవీలర్ల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించిన జిల్లా ఎస్పీ. ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగించుకుని రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
అనంతపురంలో టూవీలర్లకు సైలెన్సర్లు బిగించుకుని భారీ శబ్దాలు చేసుకుంటూ తిరుగుతున్న వారిపై జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు కొరడా ఝుళిపించారు. నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న 110 టూవీలర్ల సైలెన్సర్లను స్థానిక క్లాక్ టవర్ సమీపంలో ఎస్పీ గారు రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు.
ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా.. వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బైక్ యజమానికి 3 నెలల జైలు, రూ.10వేల వరకు జరిమానాతో పాటు 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎస్పీ గారు స్పష్టం చేశారు.