🔴BREAKING: బయట కనిపిస్తే అరెస్ట్ చేయండి.. సీరియస్ వార్నింగ్!
కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామనిౌ ప్రజా భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్‌లను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్ డౌన్‌ను అమలు చేయడంతో కరోనాను అరికట్టవచ్చని లేకపోతే మనం దీనిని అరికటలేము అని డీజీపీ తెలిపారు.
నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా కంట్రోల్ లో ఉందని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి బయటకు రావాలన్నా జీవో ప్రకారం నడుచుకోవాలి. ప్రతి దగ్గర పోలీసు చెకింగ్ ఉంటుందని డీజపీ తెలిపారు. వాహనాలపై దూర ప్రాంతాలకు అనుమతించబోమని చెప్పారు. కిరాణా షాపులు, కూరగాయాల దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంక్‌లకు అనుమతి ఉంటుంది. 7 నుంచి ఉదయం 6 గంటలకు వీటిని తెరవడానికి వీల్లేదు అని డీజీపీ స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు డీజీపీ మహేందర్ రెడ్డి.