అమెరికాలో చేదాటిన పరిస్థితి, లక్షకుపైగా..!

Saturday, March 28, 2020 08:53 AM News
అమెరికాలో చేదాటిన పరిస్థితి, లక్షకుపైగా..!

అగ్రరాజ్యం అమెరికాను కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. అదేదో ఆ దేశంపై పగ పెంచుకున్నట్లుగా ఈ మహ్మమ్మారి అక్కడి ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఈ వ్యాధి బారిన పడి 1600 మంది మృతి చెందగా దాదాపు లక్ష మందికి పైగా కరోనావైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ అమెరికాలో మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చికిత్స కోసం హాస్పిటళ్లు సరిపోవడం లేదు. తగినంత సిబ్బంది కూడా లేదు. కోవిడ్-19 బారిన పడి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికోసం అమెరికాలో వెంటిలేటర్లు సైతం తక్కువగా ఉన్నాయి. అంతేకాదు న్యూయార్క్, న్యూ ఓర్లీన్స్, డెట్రాయిట్‌లాంటి మహానగరాల్లో ఉన్న హాస్పిటల్స్‌లో మెడిసిన్స్‌ కొరతతో పాటు ఎక్విప్‌మెంట్ కొరత కూడా ఏర్పడింది. ఇక శుక్రవారం నాటికి ఒక్కసారిగా కేసుల సంఖ్య 1,02,000కు చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక దీంతో ఇన్‌ఫెక్షన్ సోకిన దేశాలు అయిన చైనా, ఇటలీలను అమెరికా మించిపోయింది.

For All Tech Queries Please Click Here..!
Topics: