దారుణం, తండ్రి శవాన్ని నిరాకరించిన కొడుకు..

Tuesday, May 26, 2020 12:53 PM News
దారుణం,  తండ్రి శవాన్ని నిరాకరించిన కొడుకు..

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ వృద్ధ దంపతుల కుటుంబం నివసిస్తోంది. వాళ్ల కుమారుడు నాగపూర్ లో బిజినెస్ నడుపుకుంటూ ఉంటున్నాడు. తాజాగా ఈ వృద్ధ దంపతుల్లో భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను అకోలా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

అదే సమయంలో 78 ఏళ్ల వయసున్న ఆమె భర్తకు గుండె పోటు వచ్చింది. ఈ విషయం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్న వృద్ధురాలికి తెలిసింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఆయనని హాస్పిటల్ కి తరలించడానికి అంబులెన్స్ పంపారు. అయితే అప్పటికే ఆటను చనిపోయారు. 

తల్లి ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటోంది. తండ్రి గుండెపోటుతో చనిపోయారన్న వార్త కొడుకుకి తెలిసింది. కొడుకు లాక్ డౌన్ లోనూ ప్రభుత్వ అనుమతి తీసుకుని నాగపూర్ నుంచి అకోలాకు వస్తాడని అంతా భావించారు. కానీ ఆ కొడుకు అలా చేయలేదు. తండ్రికి కూడా కరోనా సోకి ఉంటుందనే భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. 

అకోలా కుచ్చి మెమన్ జమాత్ పేరుతో పనిచేస్తున్న ఓ ముస్లిం స్వచ్ఛంద సంస్ధకు చెందిన కొందరు యువకులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని ముందుకొచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఇప్పటికే మహారాష్ట్రలోని 60 మందికి అంత్యక్రియలు నిర్వహించిన చరిత్రఈ సంస్థది.

For All Tech Queries Please Click Here..!
Topics: