కొరోనాతో విలవిల లాడుతున్న అమెరికాపైన మరో ప్రకృతి విపత్తు, భారీగా మృతులు.

Wednesday, April 15, 2020 08:10 AM News
కొరోనాతో విలవిల లాడుతున్న అమెరికాపైన మరో ప్రకృతి విపత్తు, భారీగా మృతులు.

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం మనకి తెలిసిందే, ఇప్పటివరికి 6 లక్షల మంది కరోనా వైరస్ భారీన పడగా. 25,000 మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మరో 13,000 మంది క్రిటికల్ స్టేజిలో ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికాను మరో ప్రకృతి విపత్తు కబళించింది.

వివరాలలోకి వెళితే అమెరికాలో సుడిగాలుల బీభత్సానికి 30 మందికిపైగా మృతి చెందారు అని అధికారులు తెలిపారు. టెక్సాస్‌, అర్కాన్‌సాస్‌, లూసియానా, మిస్సిస్సిప్పీ, అలబామా, జార్జియా, దక్షిణ, ఉత్తర కరోలినా రాష్ట్రాలలో దీని ప్రభావం బాగా కనిపించింది. ఇండ్లు ధ్వంసం అయ్యాయి, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. మిస్సిస్సిప్పీలో 11 మంది, దక్షిణ కరోలినాలో 9 మంది, జార్జియాలో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీని వలన సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: