ప్రకాశం బ్యారేజీ వద్ద రాజకీయ హడావిడీ లో విషాదం..

Sunday, August 25, 2019 10:51 AM News
ప్రకాశం బ్యారేజీ వద్ద రాజకీయ హడావిడీ లో విషాదం..

ప్రకాశం బ్యారేజీ వద్ద విషాదం చోటుచేసుకుంది, కృష్ణానదికి మరలా వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఐదు అడుగుల మేర పైకి లేపి నీటిని క్రిందికి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో జలవనరుల మంత్రి అనిల్ కుమార్, వైసీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. నీటిని క్రిందికి విడుదల చేస్తుండడంతో ప్రజలు కూడా బ్యారేజీ దగ్గర పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు సెల్ఫీ తీసుకుంటూ పట్టుతప్పి కృష్ణ నదిలో పడి నీటిలో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయాడు. వెంటనే మత్స్యకారులు బోటులో వెళ్లి అతడిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికి అతడు కొన ఊపిరితో ఉండగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అతడికి నోటిలోకి గాలిని నేరుగా ఊది శ్వాస ఇచ్చారు. కానీ ప్రాణం దక్కలేదు. ఒడ్డుకు చేర్చిన కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఆ వృద్ధుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయంతెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: