ఉదయం కరోనా పాజిటిల్, సాయంత్రం నెగిటివ్, తలపట్టుకున్న డాక్టర్లు!!
నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది, జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించగా, ఈ నెల 3వ తేదీ ఉదయం జరిగిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. నిర్ధారించుకోవడానికి ప్రతి ఒక్కరికి రెండుసార్లు టెస్ట్ చేస్తున్నారు , ఆ క్రమంలో మరలా టెస్ట్ కి పంపగా సాయంత్రం వచ్చిన మరో రిపోర్టులో అతనికి వైరస్ సోకలేదని తేలింది. ఇందుకు సంబంధించిన రెండు రిపోర్టులూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అసలే తీవ్ర భయాందోళనల్లో ఉన్న ప్రజలు, ఈ తరహా ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన, రిపోర్టులు మారడంపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అదనపు ఆర్ఎంఓ డాక్టర్ కనకాద్రి స్పందించారు. ఆ యువకుడికి కరోనా సోకలేదని తేల్చారు. సాంకేతిక సమస్య కారణంగా తొలుత వచ్చిన రిపోర్టు పాజిటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆపై తప్పు సరిచేసుకుని, దాన్ని నెగటివ్ గా నిర్దారించి, రిపోర్టును ఆసుపత్రికి పంపించారని తెలియజేశారు.