కరోనా ఎఫెక్ట్ తో ఏపీలో విద్యాసంస్థలు బంద్

Wednesday, March 18, 2020 05:38 PM News
కరోనా ఎఫెక్ట్ తో ఏపీలో విద్యాసంస్థలు బంద్

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలను వణికిస్తుంది.ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా 7500 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ప్రస్తుతం 80894 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉంది. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 3237 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ ఇప్పటివరకు 147 మంది మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరగటం కూడా ఆందోళన కలిగిస్తుంది .

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వరకు స్కూల్స్, కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయం. కోచింగ్ సెంటర్ తో పాటు అన్నీ బంద్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది.

For All Tech Queries Please Click Here..!
Topics: