రేవతి తొక్కిసలాట వలన చనిపోలేదు.. డాక్టర్ల సంచలన రిపోర్ట్
పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి సంధ్య థియేటర్ కు వచ్చిన రేవతి కుటుంబం సుమారు రూ.12,000 ఖర్చు పెట్టి ఎంతో ఆతృతగా థియేటర్ కు వెళ్లింది. అయితే అదే షోకు హీరో అల్లు అర్జున్ రావడం, తమ అభిమాన హీరో వచ్చాడని అభిమానులంతా ఏగబడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అప్పటికే అక్కడ కుటుంబంతో పాటు వచ్చిన రేవతి ఆ తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే మరియు ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి తొక్కిసలాట వలన చనిపోలేదని డాక్టర్లు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మరి సంధ్య థియేటర్ వద్ద చనిపోయిన రేవతి మృతికి అసలు కారణం ఏంటో చూద్దాం రండి.
రేవతి మృతికి అందరూ తొక్కిసలాటే కారణం అని భావించారు. కానీ రేవతి మృతికి అసలు కారణం ఊపిరి ఆడకపోవడం అని తెలిపారు. రేవతి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్లు ఆమె శరీరంపై తొక్కిసలాట వలన జరిగిన గాయాలు లేదా ఎముకలు విరగడం జరగలేదు. అక్కడ జరిగిన తొక్కిసలాటో రేవతికి ఊపిరి ఆడక మరణించినట్లు తెలిపారు.
అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటం వలన చాలా వరకూ ఊపిరి ఆడకనే రేవతి మృతి, శ్రీ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అంతే కాదు, ఇటు శ్రీ తేజ్.. అటు రేవతి శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదు మరియు శరీరంపై గాయాలు లేవని తెలుస్తోంది. దీంతే రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదని, ఊపిరి ఆడకనే మరణించిందని క్లారిటీ వచ్చింది.