ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు
Sunday, November 24, 2019 08:12 PM News

ఇటుకలపల్లి :
అనంతపురం రూరల్ మండల ఇటుకల పల్లిలోని జెరూసలేం చర్చిలో ఆదివారం సపోస్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కోసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ లాజరస్ ప్రసాద్ రెడ్డి క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడవాలన్నారు. దయ, శాంతి, కరుణ అలవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు ఫిలిప్ ప్రశాంత్ రెడ్డి, సలోమి, ఆనంద్, శ్రీకాంత్, విమల, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: