షాకింగ్: మలద్వారంలో మందు బాటిల్నె, ఇలాంటిది ఇదే మొదటి కేసు అంటున్న డాక్టర్లు.

Sunday, May 31, 2020 12:56 PM News
షాకింగ్: మలద్వారంలో మందు బాటిల్నె, ఇలాంటిది ఇదే మొదటి కేసు అంటున్న డాక్టర్లు.

మందు తాగక మత్తులో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు ఇప్పటిదాకా మందుబాబులకు సంబంధించిన విచిత్ర కథనాలెన్నో చదివాం. ఇలాంటి కధ ఎప్పుడూ చదివివుండరు అని డాక్టర్లే అంటున్నారు. నా సుదీర్ఘ కెరీర్ లో ఇలాంటి వింత కేసును ఎప్పుడూ చూచలేదు అని వాపోయారు నాగపట్నం ప్రభుత్వాసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ పాండియరాజ్.

వివరాలలోకి వెళితే రెండ్రోజుల కిందట ఆయన డీల్ చేసిన కేసు తాలూకు ఫొటోలు, వార్తలు వైరల్ అయ్యాయి. ఓ వ్యక్తి మలద్వారంలో చిక్కుకుపోయిన మద్యం బాటిట్ ను సర్జరీ ద్వారా తొలగించారాయన. బాధితుడి పేరు వెల్లడించకుండా అసలేం జరిగిందో డాక్టర్ పాండియరాజ్ మీడియాకి చెప్పారు. నాగపట్నం జిల్లాలోని నాగూరు చెందిన 29 ఏళ్ల యువకుడు జిల్లా ఆస్పత్రికి వచ్చి మలద్వారంలో భరించలేని నొప్పి ఉన్నట్లు చెప్పడంతో ఎక్స్ రే తీయించారు. ఆ రిపోర్టుల్లో మ్యాన్షన్‌ హౌస్‌ బ్రాండ్‌ను పోలిన క్వార్టర్ బాటిల్ అతని లోపల చిక్కుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. లోపలున్న గాజు సీసా పగిలిపోతే అతని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడొచ్చని భావించిన డాక్టర్లు హుటాహుటిన సర్జరీ చేశారు.

అసలీ ఘటనకు కారణం మద్యమేనని డాక్టర్ పాండియరాజ్ చెప్పారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తాను తాగిన బాటిల్ ను మలద్వారంలోకి గుచ్చుకున్నాడు. సగం దూరిన తర్వాత వెనక్కి లాగడానికి ప్రయత్నించగా అది రాలేదు. దీంతో మొత్తం బాటిల్ ను బలవంతంగా లోపలికి నెట్టుకున్నాడు. మత్తు దిగిన తర్వాత నొప్పి ఉన్నప్పటికీ, ఈ సంగతి ఎవరికనా చెబితే పరువు పోతుందని భావించి, రెండు రోజులు అలాగే ఉండిపోయాడు. చివరికి నొప్పి తాళలేని స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు అని వివరించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: