సుకుమార్ పెద్ద వెదవ... అల్లు అర్జున్ ఉచ్చ తాగరా హౌలే: తీన్మార్ మల్లన్న
తెలుగు చిత్ర సీమలో సుకుమార్ క్రియేటివ్ డైరక్టరుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకానొక దశలో రాజమౌళి కూడా అన్నారు.. నాకు పోటీ అంటే సుకుమార్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 1500 కోట్లుకు పైగానే వసూలు చేసింది. పుష్ప-2 సృష్టించిన భారీ విజయాన్ని ఒక్క సంధ్య థియేటర్ ఘటన వలన డైరక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ మరియు నిర్మాతలతో ఎవరూ ఈ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.
సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో, చిత్ర పరిశ్రమ నుండి రాజకీయం నాయకులకు వరకూ వాడీ వేడీ చర్చల, డిబేట్లతో గత రెండు వారాలుగా రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రాజకీయ పెద్దలు అయితే, పుష్ప-2 టీమ్ లోని ఏ ఒక్కరినీ వదలకుండా చెడామడా వాయించేస్తున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. డైరక్టర్ సుకుమార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సుకుమార్ అనే హౌలే గాడు.. చూపించిన సినిమా అని ఫైర్ అయ్యాడు. సినిమా ఏమైనా రియాల్టీగా ఉందా అంటూ మండిపడ్డాడు. సుకుమార్ సమాజానికి ఏం చూపిస్తున్నావ్.. నువ్వు తాగు బన్నీ అనేటోడిది నోరు తెరిచి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిగ్గుండాలి వెధవ అంటూ తిట్టిపోశాడు. పోలీసులు మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీశారని.. ఏ ఊరు నీది అంటూ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యాడు. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ గురించి తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా నుంచి సీనట్ తీసేయాలని.. సుకుమార్ పోలీసులకు క్షమాపణలు చెప్పాలని.. తీన్మార్ మల్లన్న డిమాండ్ చేసాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.