రాష్ట్రంలో 229కి చేరిన కేసులు, 11కి చేరిన మరణాలు

Saturday, April 4, 2020 08:13 AM News
రాష్ట్రంలో 229కి చేరిన కేసులు, 11కి చేరిన మరణాలు

కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కేసుల సంఖ్య భారీగాపెరుగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా. ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ కాగా, మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. సదరు మహిళ ఈనెల 1వ తేదీన మరణించగా. ఆమెకు కరోనా పాజిటివ్‌ అనే విషయం శుక్రవారం నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 229కి చేరగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిద్దరు మినహా అందరూ మర్కజ్‌కు వొళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం 15 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 32 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. శుక్రవారం 400 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువులకు పరీక్షలు నిర్వహించగా, 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 563 కొత్త కేసులు నమోదయ్యాయని , 14 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఢిల్లీ లోనే  93,  ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణాలో 75 కొత్త కేసులు నమోదయ్యాయి,  కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2785 కాగా మరణాల సంఖ్య 86 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: