కరోనా కల్లోలంలో భయపెడుతున్న మరో వైరస్

Wednesday, March 3, 2021 03:00 PM Offbeat
కరోనా కల్లోలంలో భయపెడుతున్న మరో వైరస్

Kottayam, Jan 4: కోవిడ్ కల్లోలంలో మరో భయంకర వ్యాధి మెల్లిగా దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను బయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus Scare) తాజాగా కేరళనూ వణికిస్తోంది. కేరళలోని కొట్టాయం‌, అలపూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ (Bird Flu Alert In Kerala) గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను (control rooms) ఏర్పాటు చేసినట్లు, తక్షణ స్పందన కోసం బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 

గత వారం అధికారులు పక్షుల శాంపిళ్లను పరీక్షల కోసం భోపాల్‌కు పంపించగా వాటిలో హెచ్5ఎన్8 వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. నీందూర్ అనే ప్రాంతంలో ఏకంగా 1500 బాతులు మరణించాయని అధికారులు చెప్పారు. ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు పాకకుండా ఉండేందుకు ఈ ప్రాంతం చుట్టూ కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని పక్షులన్ని చంపేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 12 వేల బాతులు మరణించాయని..ముందు జాగ్రత్త కోసం మరో 36 వేల పక్షుల్నీ చంపేయాల్సి రావచ్చొని వారు పేర్కొన్నారు.

కాగా గత వారం కొట్టాయం‌, అలపూజ రెండు జిల్లాలో అనేక బాతులు మరణించాయి. వీటిలో ఎనిమిది బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. వీటిలోని 5 శాంపిల్స్‌లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌8) కనుగొన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పక్షులను వేరే ప్రదేశాలకు మార్చారు.

ఈ వైరస్‌ మరణాలు సంభవించే ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన సంబంధిత ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు అధికారులు డ్రైవ్ కూడా ప్రారంభించారు. 

బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది.
 
 

For All Tech Queries Please Click Here..!