Free gynecology camps: హెల్పేజ్ ఇండియా ఉచిత గైనకాలజీ శిబిరాలు
చౌటుప్పల్ మండలం లోని జైకేసారం, నేలపట్ల, ఎస్. లింగోటం, పంతంగి, తాళ్ల సింగారం గ్రామాలలో హెల్ప్ ఇండియా సంస్థ యొక్క మొబైల్ హెల్త్ కేర్ యూనిట్ల ద్వారా మూడు రోజుల నుంచీ ఉచిత గైనకాలజీ శిబిరాలను నిర్వహించారు. తాళ్ల సింగారం గ్రామంలో బుధవారం జరిగిన శిభిరంలో లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌన్సిలర్లు కొరగోని లింగస్వామి, బత్తుల స్వామిగౌడ్, మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ తదితరులు మాట్లాడుతూ హెల్పేజ్ ఇండియా సేవలను గ్రామస్తులంతా వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు లో ఆశా వర్కర్లు మరియు వాలంటీర్ల సహకారం గ్రామీణ వైద్య సేవలలో భాగమవుతూ మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదపడుతుందని హెల్ప్ ఇండియా సిబ్బంది డాక్టర్ యువరాజ్, వరకాల వెంకటేశం, బండారి నాగరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ శిభిరాలకు ప్రత్యేక స్త్రీల వైద్య నిపుణురాలు హాజరై స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య విషయాలను గురించి చర్చించి ఉచితంగా పరీక్షలు చేశారు. అనంతరం వారికి మొబైల్ హెల్త్ కేర్ యూనిట్ల ద్వారా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లో డాక్టర్ సమతా కుమారి, డాక్టర్ యువరాజ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లతో కాశి గోవిందరాజు లతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు పి.లలిత, పి. జ్ఞ్యానేశ్వరి, వి. అనిత, విజయ, బి.విజయ, సుభద్ర హెల్పేజ్ ఇండియా వాలంటీర్లు కొర్పూరి మంజుల, దబ్బటి మహేశ్వరి, ఢిల్లీ శ్రీలత, బోయ సుజాత, దొనకొండ అనూష తదితరులు పాల్గొన్నారు.