Trians Timings Changed: ప్రత్యేక రైళ్లలో పలు మార్పులు, ఓ సారి వివరాలు చెక్ చేసుకోండి 

Wednesday, January 27, 2021 12:00 PM Offbeat
Trians Timings Changed: ప్రత్యేక రైళ్లలో పలు మార్పులు, ఓ సారి వివరాలు చెక్ చేసుకోండి 

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండియన్ రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి  తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. 

1. భువనేశ్వర్‌–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. 

2. భువనేశ్వర్‌–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. 

3. భువనేశ్వర్‌–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. 

4. భువనేశ్వర్‌–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. 

5. భువనేశ్వర్‌–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. 

6. పూరి–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. 

7. విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్‌ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. 

8. విశాఖపట్నం–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి  9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. 

9. విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!