లాక్ డౌన్ 5.0, ఏపీలో మరికొన్ని మినహాయింపులు.

Saturday, May 30, 2020 10:36 AM Politics
లాక్ డౌన్ 5.0, ఏపీలో మరికొన్ని మినహాయింపులు.

కరోనాని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ 4.0 రేపటితో ముగుస్తుంది. లాక్ డౌన్ 5.0 కొనసాగించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ ద్వారా కరోనా పరిస్థితులను గురించి, లాక్ డౌన్ 5.0 విధిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై చర్చలు జరిపారు.

అంతేకాదు రాష్ట్రాలలో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తగిన నిర్ణయాలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది కేంద్ర సర్కార్. ఇక లాక్ డౌన్ 5.0 విధించినప్పటికీ మరికొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.లాక్ డౌన్ ఆంక్షలను కంటైన్మెంట్ జోన్లకు పరిమితం చేసి, ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలపైనే లాక్ డౌన్ ఆంక్షలను ఉండేలా లాక్ డౌన్ కొనసాగించే ఆలోచనలో ఉంది కేంద్ర సర్కార్. ఇక ఈ క్రమంలో తాజాగా 4.0 గడువు రేపటితో ముగుస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. 

రాష్ట్రంలో కరోనా కేసులుఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్ల మినహా ,రాష్ట్ర పరిధిలోని ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు కూడా షరతులతో పర్మిషన్ ఇచ్చింది. అనుమతి పొందిన వాహనాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. 

For All Tech Queries Please Click Here..!
Topics: