జయహో జగన్ అంటున్న ఆంధ్రప్రదేశ్..!

Monday, January 20, 2020 02:28 PM Politics
జయహో జగన్ అంటున్న ఆంధ్రప్రదేశ్..!

సమ న్యాయం వైపు అడుగులు వేసిన మీకు ఇవే మా అభినందనలు. ఏపీలో ఓ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలనే స్వార్థ పూరిత ఆలోచనలకు స్వస్థి పలికడం. 13 జిల్లాలు అభివృద్ధి వికేంద్రీకరణ వైపు అడుగులు వేయాలనే మీ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. కర్నూలుకు గత వైభవం, రాయలసీమకు పూర్వ వైభవం తిరిగి వస్తాయనే ఆశను కల్పించారు. అమరావతి చట్టసభల రాజధానిగా మీ నిర్ణయం చాలా ఉన్నతమైంది. మేము ఇతర రాష్ట్రాలకు వెళితే రాజధానిగా అమరావతినే చెప్పుకుంటాం.

ఎప్పటినుంచో వెనుకబడింది అని పేరు తెచ్చుకున్న ఉత్తరాంధ్ర ఈ పరిపాలన రాజధానితోనైనా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నా. నేతలు మేతలకు మరగకుండా ఈ అయిదేళ్ళలో పూర్తి స్థాయి పరిపాలన అందిస్తారని, ప్రతిపక్షం స్వార్థ ప్రయోజనాలు వదిలేసి అధికార పక్షం చేసే తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: