మంత్రి అనిల్ కుమార్ గారు టీడీపీ చేసినట్లు మీరు చేయకండి..!

Tuesday, February 11, 2020 12:04 PM Politics
మంత్రి అనిల్ కుమార్ గారు టీడీపీ చేసినట్లు మీరు చేయకండి..!

మీరు ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పండి. గత ప్రభుత్వం మాదిరి వాస్థావానికి దూరంగా అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజలకి భ్రమలు కల్పించాల్సిన పనిలేదు. ప్రజలు ఈరోజు కాకపోయినా రేపు అయిన అర్థం చేసుకొంటారు. నిజాలు మాత్రమే ప్రభుత్వాలని.. పార్టిలని బతికిస్తాయి. మీరు చెప్తున్నట్టు 2021 కి అసలు పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?? నాకు మీ మీద వ్యక్తిగత కక్ష ఎమి లేదు. వాస్తవికంగా మాట్లాడుకుందాం.. నిన్న కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారిక స్టేటుస్ రిపోర్ట్ ప్రకారమే ఇప్పటికి 58% పనులు మాత్రమే పూర్తయ్యాయి. నాకు తెలిసిన సమాచారాన్ని బట్టీ గ్రౌండ్ లెవల్ లో జరిగిన పని అంతకంటే కొంచెం తక్కువే. ఒక అంచనా ప్రకారం ఇప్పటికి ఇంకా దాదాపు 50% పనులు పెండింగ్ ఉన్నాయి.

మన దేశంలో ఆర్ధిక వ్యవస్థ లో ఉన్న బడ్జెట్ పరిమితుల దృశ్యా ఇంత బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు అనుకున్న దానికన్న నిర్మాణాలు ఆలస్యం కావడం సహజమే.. అన్నింటికన్నా ముంపు ప్రాంత వాసులకు నష్ట పరిహారం.. పునరావాస కార్యక్రమం.. ఇంకా పెద్ద సవాలు. ఈ విషయం నాగార్జున సాగర్ డ్యాం దగ్గర నుండి నర్మదా డ్యాం వరకు ఎదురైన సమస్యలు సవాళ్లు మనకు తెలియనివి ఎమీ కాదు. ఈ నేపధ్యంలో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ హాయంలో చేసిన 25-30% పనులకే ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేశామని చేసుకున్న అతి ప్రచారాన్ని ప్రజలే తిరస్కరించారు. ఆ అతి ప్రచారానికి జనానికి విగట పుట్టింది. గతంలో చంద్రబాబు మాదిరిగా ఎదో చేసేస్తున్నాం అనే భ్రమ కలిగించే ప్రయత్నం చెయడం, "అతి" ప్రమోషన్.. ఈవెంట్ మేనేజ్మెంట్.. లతో ప్రజలను నమ్మించాలనుకొవడం అనవసరం. (అప్పట్లొ పోలవరం యాత్ర పేరుతో రెగ్యులర్ సర్వీసులు రద్దు చేసి బస్సులు అన్ని పోలవరం పెడితే బస్టాండ్ లో పల్లెటూర్లు పోయే ఆడవాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి ని చెప్పరాని బాషలొ ఎలా తిట్టుకున్నారో దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ప్రస్తుతం ఈ చర్చ అప్రస్తుతం)

ఈ నేపథ్యంలో గతంలో ఒక మంత్రి జగన్... రాసిపెట్టుకో... 2018 కి పోలవరం పూర్తి చేస్తాం అని సవాల్ విసిరిన వ్యక్తి ఇప్పుడు ఎమీ చేస్తున్నాడో చూస్తున్నాం. కాబట్టి వ్యక్తిగత సవాళ్లు.. భావోద్వేగాలు.. రాగద్వేషాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుండి తగినన్ని ఎక్కువ నిధులు సకాలంలో తెచ్చుకొని ప్రాజెక్ట్ ని ఒక పద్దతి ప్రకారం 2024 నాటికి పూర్తి చేస్తే చాలు. అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. కాబట్టి మంత్రిగారు మీరు 2024 నాటికి ఆంద్రుల జీవనాడి పోలవరంతో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లా వాసుల చిరకాల స్వప్నం వెలుగొండ ప్రాజెక్టు ఒక్క టన్నెల్ అయినా పూర్తి చేసి కాలువల్లో నీరు పారించగలిగితే మళ్ళీ ప్రజలు మీకు బ్రహ్మరధం పడతారు. కాబట్టి కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక యువ మంత్రిగా ఆవేశం కాస్త తగ్గించుకొని ఆచరణాత్మకంగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తే మీకు మీ ప్రభుత్వానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: