ఆయన లేఖతో సంబంధం లేదు

Thursday, July 9, 2020 03:16 PM Politics
ఆయన లేఖతో సంబంధం లేదు

ఈఎస్‌ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో ఏపీ ప్రభుత్వం అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసినప్పటినుంచి కొన్ని పత్రికా చానళ్ళు బీసీ కులాన్ని తెరమీదకి తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం గట్టిగానే చేశాయి. కానీ అవి అంతగా ఫలించలేదు అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు ఈఎస్‌ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ  బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: