శవాలపై పేలాలు ఏరే బ్రాండ్ అంబాసిడర్ జగన్
Monday, March 30, 2020 03:21 PM Politics

ఏపీలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు iఇబందులు పడి చస్తున్నా రాజకీయ నాయకుల మాటల దాడి మాత్రం ఆగటం లేదు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న పలు కామెంట్స్ చేశారు . విజయసాయి రెడ్డి చిల్లర రాజకీయం మొదలు పెట్టారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ గురించి విజయసాయిరెడ్డికి పలు ప్రశ్నలను సంధించారు.
తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి సంతకాలు సేకరించి శవాలపై పేలాలు ఏరుకున్నది ఎవరు ? అంటూ ప్రశ్నించారు . ఇక అంతేకాదు పెద్ద జబ్బుతో పోయిన వాడిని మా నాన్న కోసం పోయాడు అంటూ ఓదార్పు పేరుతో బుగ్గలు నిమిరి సగం మందికి మాత్రమే సహాయం అందించి మిగిలిన వాళ్ళకి ఎగ్గొట్టి శవాలపై పేలాలు ఏరిన నాయకుడు ఎవరు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: