ఏపీలో కేసులు వేయి దాటాయని చంకలు గుద్దుకుంటూ పోస్టులు పెడుతున్న వారి కోసం..
ప్రపంచంలో దీని భారీన పడిన దేశాల్లో కేసుల సంఖ్య ఎంత ఉంది. చావుల సంఖ్య ఎంత ఉంది.. సరే అది మనకు అవసరం లేని సబ్జెక్ట్ వారి తంటాలు వారివి అనుకుని ఇండియాకు వద్దాం.. ఇండియాలో ఆయనొస్తే కట్టడి చేసేవారంటూ ఓ తెగ సంబరపడిపోతున్నారు.. నిజమే.. ఇప్పటి దాకా ఆ వైరస్ ఎలా వస్తుందో తెలియదు దానికి ఏం మెడిసన్ వాడాలో తెలియదు. మరి మా ఆయన బాగా కంట్రోల్ చేస్తాడు వైరస్ ని చంపేస్తాడు అనడమేంటో వారికే తెలియాలి. బహుశా ఈయన, ఈయన వర్గం వైరస్ కి మందు కనిపెడతారేమో..
ఇక మరొక పువ్వుల వాదులు ఏపీలో కేసులు పెరిగిపోతున్నాయహో సీఎం ఫెయిల్ అయ్యాడహో అని ఒకటే పోస్టులతో మురిసిపోతున్నారు.. సరే వారి ప్రకారం ఏపీ సీఎం ఫెయిల్ అయ్యాడనుకుందాం.. గుజరాత్ సంగతేమిటి.. ప్రధానికి అత్యంత ఇష్టమైన రాష్ట్రం. అందులో కేసులు ఢిల్లీని మించిపోయాయి. రేపోమాపో మహారాష్ట్రను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు..మరి అక్కడ సీఎం ఫెయిల్ అయ్యారో, వ్యాధిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసారో...ప్రధాని ఎందుకు ఆపలేక పోయారో ఆరోపణలు చేసేవారికే తెలియాలి...
ఆయన ఆపుతాడు, ఈయన ఫెయిలయ్యాడు, అసలాయన చప్పట్లు ఎందుకు కొట్టమన్నాడు, దీపాలతో సరిపెట్టాడు.. రేపు ప్రసాదంతో ముగిస్తాడు.. ఇవా ఈ సమయంలో చేసే రాజకీయాలు. ఇలా చేసే వారికి నిజంగా పెద్ద నమస్కారం.. ఎవరికైనా నొప్పి కలిగితే ఏ జండూబామో, సైబాలో రాసుకోండి.. నన్ను పీకేసుకోండి.. మళ్ళీ అదే పైత్యంతో వస్తే నాకు ఆప్సన్ ఉంది గుర్తించుకోవాలని మనవి.