27 లక్షల పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచడానికి డేట్ ఫిక్స్ చేసిన జగన్..
Sunday, April 26, 2020 07:20 PM Politics

27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు జూలై 8న వైఎస్సార్ జయంతి రోజు పంపిణీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అంతే కాకుండా ఉ8చితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. కరోనా లేకపోయుంటే.. ఇప్పటికే అక్షరాలా 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టిన రోజు జూలై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం.
– సీఎం వైఎస్ జగన్
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: