గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో తప్పు జరిగితే, తోలు తీసేలా కొత్త రూల్స్ తెచ్చిన జగన్..!

Thursday, May 7, 2020 10:33 AM Politics
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో తప్పు జరిగితే, తోలు తీసేలా కొత్త రూల్స్ తెచ్చిన జగన్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్లు, గ్రామ/వార్డు స్థాయి సచివాలయాలు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఈ రెండు వ్యవస్థలను సృష్టించారు. వీటి వలన జిల్లాస్థాయి పరిపాలనా కార్యకలాపాలను గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు మరింత చేరువ చేశారు ఈ రెండు వ్యవస్థల వల్ల. దీనివల్ల రెండున్నర లక్షలమంది నిరుద్యోగులకు ఉపాధిని సైతం కల్పించినట్టయింది. కొన్నిచోట్ల అలాంటి వ్యవస్థలు కట్టు తప్పుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు గ్రామవలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో అధికంగా వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాటిని పర్యవేక్షించడానికి ఐఎఎస్ స్థాయి అధికారిని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్‌కు ఈ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మూడుకు పెంచబోతోంది ప్రభుత్వం. కొత్తగా మరో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించనుంది. గ్రామ/వార్డు సచివాలయాల పరిపాలన, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇకపై ఒక్కో జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు పని చేసేలా చర్యలను తీసుకోనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: